Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్టు 27న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ రోజుతోపాటు మరో రెండు రోజులపాటు ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Rain Alert: ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఆగస్టు 27న తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Rain Alert: రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది.