Telangana Weather

Telangana: తెలంగాణలో వర్షాలు కంటిన్యూ.. ఆ జిల్లాలకు ఎల్లో ఎలర్ట్!

Telangana: నెల మొదట్లో వరుసపెట్టి కురిసిన వర్షాలు మధ్యలో కాస్త తెరిపి ఇచ్చాయి. హమ్మయ్య అనుకునే లోపే మళ్ళీ వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు మరిన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు. అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణ లోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వారు చెప్పారు. 

Telangana: వాతావరణ శాఖ అధికారుల అలర్ట్ ప్రకారం రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  దీంతో  ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక  భారీ వర్షాలతో పాటుగా ఈదురు గాలులు కూడా వేస్తాయని అధికారులు చెబుతున్నారు. . గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో పాటు.. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Telangana: ఇక మంగళవారం పలు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షం కురిసింది.   ఇక నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెంలో 10.9 సెం.మీ, తిమ్మాపూర్‌లో 9.9 సెం.మీ, శాలి గౌరారంలో 9.1 సెం.మీ, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదనైట్లు అధికారులు చెప్పారు. ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందువల్ల  అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  బీ ఎలర్ట్.. తెలంగాణాకు మళ్ళీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *