Rahul Sipligunj Sangeet: టాలీవుడ్ సెన్సేషన్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఆయన వివాహం హరిణ్యా రెడ్డితో గురువారం (నవంబర్ 27, 2025) నాడు అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. తాజాగా జరిగిన సంగీత్ వేడుకకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సంగీత్ వేడుకలో రాహుల్ సిప్లిగంజ్, తన కాబోయే భార్య హరిణ్యకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మెగా సర్‌ప్రైజ్ ఇచ్చారు!
అవును! హరిణ్యా రెడ్డికి ఇష్టమైన క్రికెటర్, టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ను స్వయంగా సంగీత్ వేడుకకు ఆహ్వానించి రాహుల్ ఆమెను ఆశ్చర్యపరిచారు. అనూహ్యంగా చాహల్‌ను చూసిన హరిణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చాహల్ కొత్త జంటతో కలిసి ఫోటోలు దిగి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండి: National Highway Projects: తెలంగాణలో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ఆమోదం..
ఈ అద్భుతమైన సర్‌ప్రైజ్‌పై హరిణ్య తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భావోద్వేగాన్ని పంచుకున్నారు.
“మై డియర్ రాహుల్.. ఇంత పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాహల్‌కు నేను వీరాభిమానిని. ఆయన మన సంగీత్‌కు వచ్చారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నా హృదయం నిండిపోయింది. ఈ క్షణాలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చాహల్‌కు అతిపెద్ద థ్యాంక్స్” అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంకా హరిణ్య పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు తమ ప్రియతమ సింగర్‌కు అడ్వాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.
నిశ్చితార్థం & వధువు పరిచయం
రాహుల్ సిప్లిగంజ్, హరిణ్యా రెడ్డిల నిశ్చితార్థ వేడుక 2025 ఆగస్ట్ 17న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హరిణ్యా రెడ్డి.. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె. సోషల్ మీడియాలో ఆమెకు 38.9K మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
మరో రెండు రోజుల్లో జరగనున్న ఈ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్లు సమాచారం. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!

