Nobel Peace Prize: వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు. దేశంలో నియంతృత్వ పాలనను ఎదుర్కొంటూ ప్రజలకు స్వేచ్ఛా హక్కులు సాధించేందుకు ఆమె చేసిన పోరాటం నార్వేజియన్ నోబెల్ కమిటీని ఆకట్టుకుంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా విశేష చర్చకు దారితీసింది.
ఇదే సందర్భంలో భారత కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సురేంద్ర రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో మరియా మచాడోతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, “వెనెజులాలో రాజ్యాంగ హక్కుల కోసం పోరాడినందుకు మచాడోకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అదే విధంగా భారత్‌లో రాజ్యాంగాన్ని కాపాడటానికి, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ కూడా ప్రశంసలకు అర్హుడు” అని పేర్కొన్నారు.
Also Read: Lalu Family in Tattoos: లాలూ ఫ్యాన్.. రూ. 12 వేెలతో బాడీ పై పచ్చబొట్లు..
సురేంద్ర రాజ్‌పుత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. కొంతమంది నెటిజన్లు రాహుల్ గాంధీని ప్రజాస్వామ్య స్వరంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా రాహుల్ గాంధీ NDA ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.*నిరుద్యోగం, ఆర్థిక క్షీణత, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల సమస్య, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగింపు, EVM హ్యాకింగ్ ఆరోపణలు వంటి అంశాలను ఆయన లేవనెత్తారు. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని, రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఆరోపిస్తూ, ఇండియా బ్లాక్ (INDIA Bloc) పేరుతో ప్రతిపక్ష కూటమిని ఏర్పరిచారు. మచాడో లాగే రాహుల్ గాంధీ కూడా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ చర్చ దేశ, విదేశాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది.
इस बार का नोबल शांति पुरस्कार वेनेजुएला की विपक्ष की नेता को मिला है संविधान की रक्षा करने के लिये।
हिंदुस्तान 🇮🇳 के विपक्ष के नेता श्री राहुल गांधी देश के संविधान को बचाने की लड़ाई लड रहे है । pic.twitter.com/xcgfkJixlZ— Surendra Rajput (@ssrajputINC) October 10, 2025