Raghuram rajan: అమెరికా టారిఫ్‌లపై రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు

Raghuram rajan: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అమెరికా ప్రభుత్వం భారత్‌పై విధించిన 50 శాతం టారిఫ్‌లపై స్పందించారు. ఈ చర్య భారత్‌కు ఒక మేల్కొలుపు లాంటిదని, అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజన్ మాట్లాడుతూ –

“ఈ పరిణామం మన కళ్లు తెరవాలి. ఏ ఒక్క దేశంపైన అతిగా ఆధారపడకూడదు. తూర్పు ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాలతో సంబంధాలు బలోపేతం చేయాలి. అమెరికాతో వాణిజ్యం కొనసాగిస్తూ, దేశ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన 8–8.5 శాతం వృద్ధి సాధించడానికి సంస్కరణలను వేగవంతం చేయాలి.” అని సూచించారు.

అతను భారత్ ఎదుర్కొంటున్న పరిస్థితులను ఇతర ఆసియా దేశాలతో పోల్చారు.

“వారికీ తక్కువ బేస్ టారిఫ్‌లు ఉంటే, భారత్‌కు మాత్రం 25 శాతం బేస్ టారిఫ్ విధించారు. ఇది మనకు నష్టదాయకం. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంతగా క్షీణించాయో దీన్ని బట్టి అర్థమవుతుంది.” అని వివరించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనా విధానాన్ని విశ్లేషిస్తూ –

“వాణిజ్య లోటు ఉంటే, ఇతర దేశాలు అమెరికాను మోసం చేస్తున్నాయని ఆయన భావిస్తారు. కానీ తక్కువ ధరలకు వస్తువులు దిగుమతి కావడం అమెరికా వినియోగదారులకు లాభం చేకూరుస్తుందని ఆయన పరిగణనలోకి తీసుకోరు.” అని రాజన్ పేర్కొన్నారు

అలాగే, అమెరికా టారిఫ్‌ల విషయంలో భారత్ ప్రత్యేకంగా టార్గెట్ అవుతోందా అనే ప్రశ్నకు రాజన్ –

“అవును, ఇందులో ఎలాంటి సందేహం లేదు.” అని స్పష్టం చేశారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *