Raghunandan Rao

Raghunandan Rao: అంతా బాగానే ఉంది.. కానీ కవిత ఒక్కరి గురించి చెప్పడం మర్చిపోయింది

Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. “కవిత కొత్తగా ఏమీ చెప్పలేదు. మేము చాలా కాలంగా చెబుతున్న విషయాలనే ఇప్పుడు ఆమె బయటపెడుతోంది” అని రఘునందన్ అన్నారు.

కేసీఆర్ నిర్లక్ష్యం – హరీశ్, రేవంత్ కుమ్మక్కు

జడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో అప్పుడే కేసీఆర్‌కు చెప్పినా చర్యలు తీసుకోలేదని రఘునందన్ ఆరోపించారు. “2024 మార్చి 20న ఎయిర్ ఇండియా విమానంలో రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఇద్దరూ కలిసి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించారు. నేను ఈ విషయాన్ని మార్చి 22న మీడియా ముందు వెల్లడించాను. మెదక్‌లో నన్ను ఓడించేందుకు వారు కుమ్మక్కయ్యారు” అని అన్నారు.

బీఆర్ఎస్ అవినీతి పునాదులపై విమర్శ

కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ లోని అవినీతి పరిమాణాన్ని బయటపెడుతున్నాయని రఘునందన్ వ్యాఖ్యానించారు. “కేసీఆర్ క్లబ్బులు మూసివేస్తే మీరు పబ్బులు నడిపారు. టానిక్ అంశం చిన్నది. కానీ ఎమ్మెల్సీల అవినీతి చాలా పెద్దది. పోచంపల్లిలో రూ.750 కోట్లతో విల్లా నిర్మాణం, నవీన్ రావు అక్రమాలకు అడ్డూ అదుపూ లేకపోవడం ప్రజలకు తెలుసు” అని అన్నారు.

మరిన్ని నిజాలు బయటపెట్టాలని సూచన

కవిత ఇంకా బీఆర్ఎస్ పెద్దల అవినీతి గురించి బయటపెట్టాలని రఘునందన్ సూచించారు. “అధికారంలో ఉన్నప్పుడు మౌనం వహించారు. బొల్లారం, పటాన్‌చెరు, ఆదిబట్ల, బాలానగర్ భూముల కన్వర్షన్ అంశాలు ఎందుకు ప్రస్తావించలేదు? మేము చెబితే కక్షసాధింపుగా చూస్తారు. ఇప్పుడు కవితనే మాట్లాడాలి” అన్నారు.

కాంగ్రెస్‌పై డిమాండ్లు

కవిత ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు చేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు. “హరీశ్‌ పాల వ్యాపారం గురించి అయోధ్యరెడ్డి ట్వీట్ చేశారు. మోకిలాలో ప్రాజెక్టులు, నవీన్ రావు అక్రమాలపై సీఎం రేవంత్‌, ఏసీబీ వెంటనే చర్యలు తీసుకోవాలి” అన్నారు.

ఫోన్ ట్యాపింగ్, దుబ్బాక ఉప ఎన్నికల ప్రస్తావన

సంతోష్ రావు బంధువు డీసీపీ సందీప్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో అన్యాయం చేశారని ఆరోపించారు. “ఫోన్ ట్యాపింగ్, డబ్బులు పట్టుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. నార్సింగి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నప్పుడు నా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఈ విషయాలను కవిత ప్రస్తావిస్తారని అనుకున్నాం. కానీ ఆమె మౌనం వహించారు” అని రఘునందన్ విమర్శించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  SLBC టన్నెల్ వద్దకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *