Raghunandan Rao:

Raghunandan Rao: ఇందిర‌మ్మ ఇండ్ల‌పై సీఎంకు ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు లేఖ‌

Raghunandan Rao: ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్ధిదారుల ఎంపిక‌పై సీఎం రేవంత్‌రెడ్డికి మెద‌క్ ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు బ‌హిరంగ లేఖ రాశారు. ఇండ్ల ల‌బ్ధిదారుల ఎంపిక‌లో ఎంపీల‌కు కూడా 40 శాతం కోటా ఇవ్వాల‌ని ఆ లేఖ‌లో ర‌ఘునంద‌న్‌రావు కోరారు. ఎమ్మెల్యేల మాదిరిగానే ఎంపీల‌కు కూడా ల‌బ్ధిదారుల ఎంపిక‌లో అవ‌కాశం క‌ల్పించాల‌ని పేర్కొన్నారు.

Raghunandan Rao: ఎమ్మెల్యేల లాగానే ఎంపీలు కూడా ప్ర‌జ‌ల చేత ఎంపికైన ప్ర‌జాప్ర‌తినిధులే క‌దా.. అని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖ‌లో ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు పేర్కొన్నారు. గ‌తంలో ఎంపీగా ప‌నిచేసిన రేవంత్‌రెడ్డికి ఈ విష‌యంపై స‌రైన అవ‌గాహ‌న ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ మేర‌కు తాను ఆశించిన మేర‌కు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకుంటార‌ని భావిస్తున్న‌ట్టు ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *