మంత్రి కొండా సురేఖ మీద వచ్చిన ట్రోల్స్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. సురేఖను ట్రోలింగ్ చేసిన వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలే అన్నారు. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు.కొండా సురేఖపై ట్రోలింగ్ జరగడంపై హరీశ్ రావు ఒక ట్వీట్ పెట్టి వదిలేయడం కాదని, క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు.
బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్న వారే ఇలాంటి ట్రోలింగ్ చేశారని మండిపడ్డారు.ఓ మంత్రిని గౌరవపూర్వకంగా సన్మానిస్తే ఇంత దారుణంగా పోస్టులు పెట్టడమేమిటని నిలదీశారు