Radhika Sarathkumar:ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే గత నాలుగు రోజులుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూలై 28వ తేదీనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్టు సమాచారం. మొదట సాధారణ జ్వరమేనని ఆసుపత్రిలో చేరినట్టు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. అయితే అది డెంగీ ఫివర్‌గా నిర్ధారణ అయిందని వైద్యులు సూచించినట్టు తెలిసింది.
Radhika Sarathkumar:ఆమె ఆరోగ్యంగా కొంత బాగానే ఉన్నా, పూర్తిగా కోలుకునే వరకూ ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారని సమాచారం. తమిళనాడులో మీడియా కథనాల ద్వారా రాధిక అనారోగ్యం విషయాలు బయటకొచ్చాయి. రాధిక తెలంగు, తమిళం, మళయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలు. పలు టీవీ సీరియళ్లలోనూ ఆమె ప్రేక్షక లోకానికి దగ్గరయ్యారు. అనారోగ్యంపాలైన రాధిక శరత్‌కుమార్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కొన్నిచోట్ల దేవుళ్లకు పూజలు కూడా చేస్తున్నారు.