Radhika Apte : పెళ్లయిన 12 ఏళ్లకు తల్లి కాబోతున్న రాధికా ఆప్టే

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. నిన్న లండన్ లో జరిగిన సిస్టర్ మిడ్ నైట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నలుపు రంగు ఆఫ్ షోల్డర్ మిడి డ్రెస్ లో సందడి చేయగా అక్కడ బేబీ బంప్ తో కనిపించింది. దీంతో అక్కడి వచ్చిన వారంతా ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను రాధికా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంది. సిస్టర్ మిడ్ నైట్ యూకే ప్రీ మియర్ #ఐఎఫ్ఎఫ్ 2024 అంటూ రాసు కొచ్చింది. ఫోటోలలో ఆమె ఒంటరిగా, రెడ్ కార్పెట్ పై తన సహచర నటీనటులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది.

పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత రాధికా ఆప్టే తల్లి కాబోతోంది. దీంతో రాధికకు బాలీవుడ్ సెలెబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు. కొందరు పెళ్లి అయిందా? అంటూ ఆశ్చర్యపోతోన్నారు. అయితే రాధిక తన ప్రేమ, పెళ్లి, డేటింగ్ వ్యవహారాల గురించి గతంలోనే ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. తాను డేటింగ్ చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని తెలిపింది.

రాధిక ఆప్టే తెలుగు,తమిళం, హిందీల్లో మంచి చిత్రాలనే చేసింది. ప్రకాష్ రాజ్ చేసిన ధోని, బాలయ్య లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఆమె నటించిన వెబ్ సిరీస్‌లెన్నో కాంట్రవర్సీగా మారాయి. బోల్డ్ పాత్రలు, సీన్లతో రాధిక ఆప్టే ట్రెండ్ అయింది. నగ్నంగా నటించి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. రాధిక డేరింగ్ నిర్ణయాలు, నటించే తీరు, బోల్డ్ కామెంట్లు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక రాధిక ఆప్టే ఇప్పుడు ఇలా బేబీ బంప్‌తో కనిపించి నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *