Delhi: భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

Delhi: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు లభించగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు  వచ్చాయి.

మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే స్పష్టమైన ఆధిక్యం సాధించిన రాధాకృష్ణన్ విజయం ఖరారైంది. దీంతో ఆయన అధికారికంగా భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ విజయంతో ఎన్డీఏ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు, రాబోయే రాజకీయ పరిణామాల్లో రాధాకృష్ణన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *