Raashi Khanna

Raashi Khanna: రాశి ఖన్నాకు షూటింగ్‌లో గాయాలు.. “ఫర్జీ-2” సెట్స్‌లో షాకింగ్ ఘటన!

Raashi Khanna: రాశి ఖన్నా గాయాలతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె నటిస్తున్న బాలీవుడ్ వెబ్ సిరీస్ “ఫర్జీ-2” షూటింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో భాగంగా రాశి ఖన్నా తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ముఖం నుంచి రక్తస్రావం కాగా, చేతులకు కూడా గాయాలైనట్లు సమాచారం.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాశి ఖన్నా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఫర్జీ-2” వెబ్ సిరీస్‌లో రాశి ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె స్వయంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నారు. అయితే, ఈ శిక్షణ సమయంలో ఊహించని విధంగా గాయాలు తలెత్తాయి.

Also Read: Tourist Family: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సంచలనం.. ఫిదా అయిపోయిన రాజమౌళి!

Raashi Khanna: రాశి ఖన్నా తన పాత్ర కోసం ఎంత కష్టపడుతున్నారో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఈ విషయంపై రాశి ఖన్నా సోషల్ మీడియాలో తన ఫొటోస్ షేర్ చేస్తూ స్పందించింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం “ఫర్జీ-2” సిరీస్ షూటింగ్ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ ఘటన బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *