Ram Charan Game Changer

బీట్ అదిరింది… రా మచ్చా మచ్చా సాంగ్ ప్రోమో వచ్చేసింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమాలోని ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది. కొద్దీసేపటి క్రితమే మేకర్స్ ఈ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 30న పూర్తి సాంగ్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. నాకాష్ ఆజిజ్ పాడారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ల పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘జరగండి జరగండి’ పాటకు మిక్స్డ్ టాక్ వచ్చింది. మరి రా మచ్చా మచ్చా సాంగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

రాజకీయ, సామాజికాంశాలను చర్చిస్తూ తనదైన శైలి సందేశంతో దర్శకుడు శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సముద్రఖని, ఎస్‌‌‌‌‌‌‌‌.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *