Pvn Madhav: పెట్రోల్ ధరలు తగ్గకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ తీవ్ర విమర్శలు చేశారు.ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం కేవలం 18 శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తోందినని స్పష్టం చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దీని కంటే రెండు రెట్లు అధికంగా పన్నులు విధిస్తున్నాయినని ఆరోపించారు.
రాష్ట్రాలు ఈ అధిక పన్నులు తగ్గించడానికి అంగీకరించడం లేదని, ఫలితంగా ప్రజలపై పెట్రోల్ ధరల రూపంలో భారీ భారం పడుతోందని మాధవ్ తెలిపారు. కేంద్రం తక్కువ శాతం జీఎస్టీతోనే ముందుకు వెళ్తుంటే, రాష్ట్రాలు మాత్రం తగ్గించేందుకు ముందుకు రాకపోవడమే అసలు సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు.