Pushpa: ఆస్కార్ రేసులో పుష్ప 2

Pushpa: తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా ఈసారి ఆస్కార్ రేసులో పలువురు చిత్రాలు నిలిచాయి. పెద్ద బడ్జెట్‌, విభిన్న కథలతో తెరకెక్కిన ఈ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.

ఆస్కార్ నామినేషన్స్‌ కోసం “పుష్ప 2”, “సంక్రాంతికి వస్తున్నాం”, “కన్నప్ప”, “గాంధీ తాత చెట్టు”, “కుబేర” సినిమాలు ఎంపికయ్యాయి.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్ ‘పుష్ప 2’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు సృష్టించింది. మరోవైపు, విభిన్న కధా వస్తువుతో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమా కూడా చర్చనీయాంశంగా మారింది.

“సంక్రాంతికి వస్తున్నాం” అనే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌, ‘గాంధీ తాత చెట్టు’ అనే ఆలోచనాత్మక చిత్రం, అలాగే ‘కుబేర’ వంటి వాణిజ్య, వినూత్న చిత్రాలు ఈ జాబితాలో చోటు చేసుకోవడం గమనార్హం.

ఇక ఈ సినిమాలు ఆస్కార్ నామినేషన్ల తుది జాబితాలో నిలుస్తాయా లేదా అన్న ఆసక్తి ఇప్పుడు సినీప్రియులలో నెలకొంది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *