Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబోలో సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2 ది రూల్’ బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసింది. ఈ మూవీ సూపర్ హిట్ తర్వాత ‘పుష్ప 3 ది ర్యాంపేజ్’ కోసం ఫ్యాన్స్ లెక్కలు కట్టేస్తున్నారు. కానీ ‘పుష్ప 2’ క్లైమాక్స్‌లో సుకుమార్ ఓ సర్‌ప్రైజ్ విలన్‌ను రివీల్ చేసి అందరి నోట్లో నాలుకలు ఆగిపోయేలా చేశారు. ఆ విలన్ ఎవరు? ఈ ఒక్క ప్రశ్నతో టాలీవుడ్ ఇప్పుడు రణరంగంలా మారింది.
Also Read: Sangeeth Shobhan: సోలో హీరోగా సంగీత్ శోభన్ సందడి!
Pushpa 3: ఇటీవల తమిళ ఈవెంట్‌లో సుకుమార్‌ను ప్రెస్ కార్నర్ చేస్తే, “విజయ్ దేవరకొండా లేక నానీ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ 2024లో నాకే తెలీదు, 2026లో స్క్రిప్ట్ రాసే సుకుమార్ చెప్తాడు” అంటూ కూల్‌గా ఎస్కేప్ అయ్యారు. అంటే ఏంటంటే, విలన్ ఇంకా ఫిక్స్ కాలేదని అర్ధం. సుకుమార్ ట్విస్ట్‌లతో ఫ్యాన్స్‌ను తెగ ఉర్రూతలూగిస్తారని టాలీవుడ్‌కు తెలుసు.
ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ విలన్ ఎవరనే గుస్సా గుస్సాలతో ఊగిపోతోంది. రౌడీ విజయ్ దేవరకొండనా? నానీనా? లేక ఊహకందని బిగ్ స్టార్‌నా? 2026 వరకు ఈ సస్పెన్స్ తప్పదు అన్నట్లుంది.