Pushpa-3: పుష్ప 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. ఓటీటీలో కూడా ఈ సినిమా ట్రెండింగ్లో దూసుకుపోతుంది. మొదటి రెండు భాగాలు హిట్ అవ్వడంతో అభిమానుల్లో పుష్ప 3 పట్ల భారీ హైప్ క్రియేట్ అయింది. పుష్ప 3 ఎప్పుడు వస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. పుష్ప 3 త్వరలో ఉండబోతుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తాజాగా నిర్మాత వై. రవిశంకర్ ఇప్పట్లో లేనట్టు గట్టి షాక్ ఇచ్చారు.రాబిన్ హుడ్ ప్రెస్మీట్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్, పుష్ప 3, 2028లో వస్తుందని స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ లకు భారీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. దాంతో పుష్ప 3 కోసం అభిమానులు మూడు సంవత్సరాలు వెయిట్ చేయక తప్పదు.
