Kissik Song: అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. శ్రీలీల డ్యాన్స్ చేసిన స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ విడుదలైంది.
సుకుమార్ తన ప్రతి సినిమాలో ఒక ”స్పెషల్ సాంగ్” ఉండేలాగా చూసుకుంటారు. ఆర్య నుండి పుష్ప వరకు అది కొనసాగింది. మద్యలో నాన్నకు ప్రేమతో మూవీలో తప్ప. అవి ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కూడా ఉండవు కథలో భాగం గానే ఉంటాయి. గత సినిమా పుష్ప లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ”ఊ ఉంటావా.. ఊ ఊ అంటావా” సాంగ్ ఐతే యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు కోటింది. తాజాగా పుష్ప 2 లో అల్లు అర్జున్ తో కలిసి శ్రీలీల స్పెషల్ సాంగ్ లో స్టెప్ లు వేసింది. సుకుమార్ వాయిస్ తో స్టార్ట్ ఐన ఈ సాంగ్ ‘కిస్సిక్’ ఎన్ని రికార్డ్స్ కొడుతుందో చూడాలి. ”కిస్సిక్” సాంగ్ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా చంద్రబోస్ లిరిక్స్ అందించారు. సుబ్లాషిని వోకల్స్ అందించారు. ”పుష్ప ది రూల్” డిసెంబరు 5న బాక్సాఫీసు ముందుకు రానుంది.