Pushpa 2

Pushpa 2: ఓటీటీలో ‘పుష్ప-2’… డ్యూరేషన్ ఎంతంటే…

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ‘పుష్ప’. దానికి సీక్వెల్ గా డిసెంబర్ 5న ‘పుష్ప-2’ విడుదలైంది. రూ. 1800కు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసిన ‘పుష్ప -2’ గత యేడాది బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ అతి త్వరలో ‘పుష్ప-2’ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలిపింది. హిందీ భాషలో విడుదల చేయడానికి అక్కడి మల్టీప్లెక్స్ థియేటర్లతో చేసుకున్న ఒప్పందం అడ్డువచ్చే ఆస్కారం ఉంది. ఇదిలా ఉంటే జనవరి 30న ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేస్తారని, దీనిని నిడివి మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ‘పుష్ప-2’ విడుదలైన తర్వాత రీ-లోడెడ్ వర్షన్ పేరుతో మరో 20 నిమిషాలను యాడ్ చేశారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ మరో 24 నిమిషాల నిడివిని జత చేస్తున్నట్టు తెలిపింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Health Tips: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *