Pushpa 2: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ ఇప్పటికే పలు రికార్డులను నమోదు చేసింది. తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ‘పుష్ప2’ విడుదలైన 14 రోజుల్లోనే 16.19 మిలియన్ టిక్కెట్ అమ్మకాలు జరిగాయి. ఆన్ లైన్ అమ్మకాలలో రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రాల సరసన ‘పుష్ప2’ చేరింది. ‘కెజిఎఫ్, బాహుబలి2, ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో కంపేర్ చేస్తే రెండు వారాల్లోనే ‘పుష్ప2’ రెండో స్థానంలో నిలవడం విశేషం. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కంటే ముందు ‘కెజిఎఫ్2’ మాత్రమే ఉంది. త్వరలోనే ఆ సినిమా రికార్డ్ ను సైతం ‘పుష్ప2’ దాటేస్తుందని అంటున్నారు. బన్నీ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్, పాటలు అన్నీ ఈ స్థాయి విజయానికి కారణంగా చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Kiccha Sudeep: ‘మాక్స్’ మూవీ రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?
Pushpa 2: ఆన్ లైన్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో లో టాప్ 5 టిక్కెట్ అమ్మకాల రికార్డ్ జాబితాను పరిశీలిస్తే కెజిఎఫ్ 2-17.1 మిలియన్స్ తో తొలి ప్లేస్ లో, ‘పుష్ప2’ -16.19 మిలియన్స్ తో సెకండ్ ప్లేస్ లో, ‘బాహుబలి2’ -16 మిలియన్స్ తో మూడో స్థానంలో, ‘ఆర్ఆర్ఆర్’ -13.4 మిలియన్స్ తో నాలుగో ప్లేస్ లో, ‘కల్కి 2898ఎడి’ -13.14 మిలియన్ అమ్మకాలతో ఐదో స్థానంలో ఉన్నాయి. మరి భవిష్యత్ లో ఏ సినిమాలు ఈ జాబితాలో చోటు చేసుకుంటాయో చూడాలి.