Pushpa 2

Pushpa 2: పైనల్ గా ‘పుష్ప2’ ఆర్ఆర్ ఎవరిది ఉంటుంది!?

Pushpa 2:  ‘పుష్ప2’ ట్రైలర్ రిలీజ్ తో అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక పాట్నా ఈవెంట్ తో బన్నీ పాన్ ఇండియా స్టామినా ఏమిటన్నది తేలిపోయింది. ఎవరూ ఊహించని స్థాయిలో వచ్చిన జనసందోహం చూసి ఉత్తరాది సినిమా వారి మతి పోయిందట. ఇక అందరి దృష్టి రాబోయే ఐటమ్ సాంగ్ పైనే ఉంది. అంతే కాదు సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పూర్తి కావచ్చిందంటున్నారు. థమన్ ఫస్ట్ హాఫ్ పూర్తి చేసినట్లు చెప్పేశాడు. మిగిలిన భాగాన్ని అజనీశ్ లోక్ నాథ్, శ్యామ్ సి.ఎస్ పూర్తి చేస్తున్నారట. అయితే దేవిశ్రీ ప్రసాద్ కూడా తన వంతు ఆర్ఆర్ ని పూర్తి చేశాడట. నిజానికి సినిమా మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం ఓ వర్షన్ అందించేశాడట. ఇక రెండో వర్షన్ ని థమన్, అజనీశ్, శ్యామ్ పూర్తి చేశారన్న మాట. సో రెండు వర్షన్స్ రెడీ గా ఉన్నాయన్న మాట. ఏది ఫైనల్ చేస్తారన్నది సుకుమార్ చేతుల్లో ఉంది. ఇటీవల విడుదలైన Pushpa 2 ట్రైలర్ కి కూడా ఇలాగే మూడు వర్షన్స్ రీరికార్డింగ్ చేయించారట. అయితే చివరికి దేవిశ్రీ వెర్షన్ తోనే రిలీజ్ అయింది. ఇక సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుందంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

ఇది కూడా చదవండి :  Allu Arha: అల్లు అర్హ అచ్చ తెలుగు అదరహో!

Pushpa 2:  కాగా, ఇటీవల పుష్ప2 ట్రైలర్ బీహార్ లోని పాట్నాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లాంచ్ సందర్భంగా బీహార్ లో బన్నీకి జనం నీరాజనం పట్టారు .  దాదాపు రెండు లక్షలమందికి పైగా అక్కడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూడడం కోసం వచ్చారని అంచనా. పుష్ప2 Pushpa 2 ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది .  టాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ ట్రైలర్ చూసి అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ నటన.. సుకుమార్ టేకింగ్ అదిరే రేంజిలో ఉన్నాయని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. పుష్ప 2 పై ఎన్నో అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినా తరువాత సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్సుకతను మరింత పెంచింది ట్రైలర్. మీరు ట్రైలర్ చూశారా ?  చూడకపోతే ఇక్కడ చూడండి .  చూసినా మరోసారి కూడా చూడొచ్చు .

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *