Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ పై సినిమా అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన జైలర్కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, కామెడీ మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు, మార్నీ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైపోగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో మరో నటి చేరినట్లు సమాచారం.
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి షమ్నా కాసిం అలియాస్ పూర్ణ కూడా ‘జైలర్ 2’లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఆమె షూటింగ్‌లో ఇప్పటికే పాల్గొనగా, తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయడానికి దాదాపు 20 రోజులు పట్టిందని చెబుతున్నారు. ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ దగ్గరి వర్గాల సమాచారం.
