Puri-VijaySethupathi: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, తమిళ స్టార్ విజయ్ సేతుపతితో కలిసి కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న హాట్ టాక్ ఏంటంటే, ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారట.మహతి గతంలో తన ట్రెండీ ట్యూన్స్‌తో ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించారు. మరి, ఈ బిగ్ బడ్జెట్ మూవీకి ఆయన మ్యూజిక్ మెస్మరైజ్ చేస్తుందా? అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో టబు, దునియా విజయ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరీతో కలిసి ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

