Puri Jagannadh

Puri Jagannadh: శ్రీ లీల హీరోయిన్ గా గోపీచంద్ – పూరీ జగన్నాథ్ కొత్త సినిమా?

Puri Jagannadh: పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. ఇప్పటికే గోపీచంద్‌కు ఓ కథ వినిపించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతేగాక ఈ సినిమా షూటింగ్ కి ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది.ఇక వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన ‘గోలీమార్’ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. మరి ఈసారి పూరి, గోపీచంద్ కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *