Puri Jagannadh

Puri Jagannadh: పూరి-విజయ్ సేతుపతి బిగ్ బ్యాంగ్: రాజకీయ సెటైర్లతో సినిమా సంచలనం!

Puri Jagannadh: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. విజయ్ సేతుపతి హీరోగా రాబోతున్న ఈ చిత్రం నేటి రాజకీయాలపై కేంద్రీకృతమై ఉంటుందని సమాచారం. పొలిటికల్ సెటైర్లతో నిండిన ఈ సినిమా సమాజంలోని సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తుందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ విద్యా బాలన్ రాజకీయ నాయకురాలి పాత్రలో నటించనుంది. పూరి సినిమాల్లోని క్యారెక్టర్స్‌కు ఉండే డెప్త్ ఈ సినిమాలోనూ కనిపించనుంది.
ఇటీవల వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో, పూరి ఈసారి విజయ్ సేతుపతితో బలమైన కథతో సిద్ధమయ్యాడు. గత చిత్రాలతో పోలిస్తే కంటెంట్‌లో లోపం ఉందన్న విమర్శలను అధిగమించేలా పూరి స్క్రిప్ట్ రూపొందించినట్లు సమాచారం. ఈ సినిమాతో పూరి మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంటాడా? లేదా? అనేది సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cm revanth: కెసిఆర్ పాలమూరు ద్రోహి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *