Puducherry: అందాల సినీ తారలుగా అభిమాన లోకాన్ని సంపాదించుకున్న హీరోయిన్లు కాజల్, తమన్నా ఓ కేసులో విచారణను ఎదుర్కోనున్నారు. ఈ మేరకు ఓ మోసం కేసులో వారిని పోలీసులు విచారించనున్నారు. ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు.
Puducherry: పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి కాజల్, తమన్నాలను అక్కడి పోలీసులు విచారించనున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. లాభాల ఆశచూపి 10 మంది నుంచి సుమారు రూ.2.40 కోట్లు వసూలు చేశారని అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Puducherry: క్రిప్టో కరెన్సీ కంపెనీ 2022లో కోయంబత్తూరు ప్రధాన బ్రాంచి ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆనాటి స్టార్ హీరోయిన్ అయిన తమన్నా హాజరయ్యారు. అదే విధంగా మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హాజరయ్యారు. ఆ తర్వాత ముంబైలో భారీ పార్టీ నిర్వహించి వేలాది మంది నుంచి నగదు సేకరించారు.
Puducherry: లాభాలు ఇవ్వజూపీ మోసం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే నితీశ్ జైన్ (36), అర్వింద్ కుమార్ (40)ను అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కాజల్, తమన్నాను పుదుచ్చేరి పోలీసులు విచారించేందుకు సిద్ధమయ్యారు.

