Ration Rice Mafia: రేషన్ రైస్ మాఫియా గురించి ఎంత చెప్పిన తక్కువే… పెదవాడికి వెళ్లే బియ్యం ఏముంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే… రాష్ట్రంలో ప్రభుత్వాలకు సమాంతరంగా అధికారులను మేనేజ్ చేసి గ్రీన్ ఛానల్ రన్ చేసారంటే
రేషన్ డాన్స్ నెట్ వర్క్ ఏ స్ధాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చు… గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ మాఫియా ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిపోయింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెదవాడి కడుపునింపే బియ్యం అక్రమార్కులకు చిక్కకూడదని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. దీంతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డైరెక్టుగా రంగంలోకి దిగారు. సినీ పక్కీలో ఆకస్మిక తనిఖీలు, అర్ధరాత్రులు రోడ్లపై మాటువేసి అక్రమంగా రేషన్ బియ్యం తరలించే లారీలను సైతం సీజ్ చేయించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అక్రమ రేషన్ బియ్యం కాకినాడ పోర్టు కేంద్రంగా విదేశాలకు తరలిపోతుంది. చివరకు నాదెండ్ల అక్కడ కూడా మాటువేసి పెద్దఎత్తన గౌడౌన్లు సీజ్ చేసి, 50 వేల టన్నులకుపైగా రేషన్ బియ్యం సీజ్ చేసారంటే రేషన్ మాఫియా ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Ration Rice Mafia:ఏపీ వ్యాప్తంగా రేషన్ మాఫియా ఒక ఎత్తైతే… విజయవాడలో రేషన్ మాఫియా మరో ఎత్తు… నగరంలో రేషన్ డీలర్లే కొందరు వ్యక్తులను పెట్టి రైస్ సేకరిస్తారని సమాచారం. విజయవాడలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు రేషన్ మాఫియా దందా నడిపేలా పరోక్షంగా నిర్ణయించుకున్నారు. వీరంతా అంతర్గంతంగా ఒక మాట మీద ఉంటారు. ఒకరి ఏరియాకి ఒకరు వెళ్లకుడదాని రూల్స్ మాత్రం తుచా తప్పకుండా పాటిస్తారు. ఒక్కొక్కరు పది నుంచి 15 మంది యువకులను పెట్టుకుని రేషన్ డిపోల నుంచి బియ్యం సేకరిస్తారు. అలా సేకరించిన బియ్యాన్ని వారి వారి వ్యక్తిగత గౌడౌన్‌ల్లో భద్రపర్చుకుంటారు. అలా ఒక్కొక్కరు కనీసం 15 టన్నులు సేకరించిన తర్వాత ఆ బియ్యం మొత్తాని వారు ఎంపిక చేసుకున్న రైస్ మిల్లులకు తరలిస్తారు.
Ration Rice Mafia: రేషన్ బియ్యం సేకరించడం నుంచి వాటిని రైస్ మిల్లులు వరకు తరలించడం చాలా కీలకమైన పని… ఈ మొత్తం ఎపిసోడ్‌లో అధికారులకు అక్రమార్కులకు మధ్య వారధిగా ఒక డీలర్ పనిచేస్తున్నారు. అక్రమ రేషన్ మాఫీయాను తెరవెనక నుంచి నడిపేది మొత్తం ఆ డీలర్… అలా సేకరించిన బియ్యం మెత్తాన్ని పెదవడ్లపూడిలో 3 రైస్ మిల్లులు, పామర్రులో 2 రైసు మిల్లులు, కొత్తూరు, తాడేపల్లి రైస్ మిల్లులకు రైస్ తరలిస్తారు. కార్డు హోల్డర్ వద్ద కిలో 8 రూపాయల నుంచి 10 రూపాయలకు కొనుగోలు చేస్తారు. సేకరించిన బియ్యాన్ని డీలర్ కిలో 18 రూపాయలకు కొనుగోలు చేస్తారు. అలా కొన్న రైస్‌ను రూ. 20 నుంచి 21 రూపాయలకు రైస్ మిల్లరకు విక్రయిస్తారు. ఆ రైస్ మిల్లులో కొంచెం పాలిస్ పట్టి, బ్యాగ్స్ మార్చి ఎక్సపోర్టర్‌కు తరలిస్తారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప్రతి పాయింట్‌లో అధికారులను మేనేజ్ చేస్తారు. చివరిలో జిల్లాలు దాటి తరలించే పక్రియలో అనధికారికంగా గ్రీన్ ఛానల్ రన్ చేస్తారంటే రేషన్ మాఫీయా ఏ మేరకు వర్క్ చేస్తోందో అర్దం చేసుకోవచ్చు.
Ration Rice Mafia: ప్రభుత్వం మారినా… ప్రభుత్వాధికారులు పాత ప్రభుత్వ రుచులు వాసనలు వదులుకోలేకపోవడంతో…
రేషన్ మాఫియా ఆగడాలు యధేచ్చగా సాగిపోతున్నాయి… అయితే వీటిని కట్టడి చేసేందుకు కూటమి సర్కార్
శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది.