Vizag: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖలోని స్టీల్ ప్లాంట్ రక్షణ కోసంమరో రూపంలో ఉద్యమం ప్రారంభంకానున్నది. ఈ నెల 10 నుంచి శ్రీకారం చుట్టాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు 10వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ రోడ్ కాళీమాతా ఆలయం వద్ద పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు సంస్థ ప్రతినిధులు శుక్రవారం ప్రకటించారు. ప్రధాని మోదీకి 10 లక్షల పోస్టు కార్డులు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని పోస్టుకార్డుల ద్వారా ప్రధానిని కోరుతామని సంస్థ కన్వీనర్ రమణమూర్తి తెలిపారు.
