Mahesh Babu

Mahesh Babu: ఆ చిన్న తప్పే.. 1 నేనొక్కడినే మూవీ ని ప్లాప్ చేసింది..?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన ప్రతి సినిమా రిలీజ్‌కు ముందే దేశవ్యాప్తంగా భారీ బజ్‌ క్రియేట్‌ చేస్తుంది. అయితే, 2014లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాపై తాజాగా నిర్మాత అనిల్ సుంకర చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అనిల్ సుంకర మాట్లాడుతూ.. “మేము 1 నేనొక్కడినే మూవీ ట్రైలర్‌ను ఆన్‌లైన్‌(యూట్యూబ్ )లో రిలీజ్ చేయలేదు.  మేము  ట్రైలర్‌ను ఫ్యాన్స్ కోసం థియేటర్లలో ప్రదర్శించి, మహేష్ బాబుతో ప్రత్యక్షంగా చిట్‌చాట్ నిర్వహించాలని ప్లాన్‌ చేశాం. కానీ అప్పట్లో ఒకరు ‘ట్రైలర్‌లో కథ బయటపడితే సినిమాకు ఓపెనింగ్స్ రావు’ అని చెప్పడంతో, మేము ఆ ఆలోచనను విరమించుకున్నాం” అని తెలిపారు.

అలాగే సినిమా రిలీజ్‌ అయిన తర్వాత థియేటర్‌లో ప్రేక్షకులు చూసినప్పుడు, హీరోకు వ్యాధి ఉందని తెలిసి చాలామంది నిరుత్సాహానికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు. “ఒకవేళ ఆ విషయం ట్రైలర్‌లోనే చూపించి ఉండి ఉంటే, ప్రేక్షకులు ముందే అలవాటు పడి థియేటర్‌లో అంతగా షాక్‌ అవ్వరు. అప్పుడు సినిమా మీద నెగెటివ్‌ రియాక్షన్ తక్కువగా ఉండేది. ట్రైలర్‌లో కథ ముందే తెలిసినా నష్టమేమీ ఉండదు అనే విషయం మాకు ఆలస్యంగా అర్థమైంది” అని అన్నారు.

ఇది కూడా చదవండి: Kamalapuram Putta: కమలాపురం టు పులివెందుల.. చైనత్యరెడ్డి రప్పా రప్పా

దూకుడు విజయానంతరం మహేష్‌తో చేసిన 1 నేనొక్కడినే సినిమా రికార్డులను బద్దలు కొడుతుందని బృందం నమ్మిందని, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఆ సినిమా ఫలితం పూర్తిగా వేరేలా ఉండేదని నిర్మాత అభిప్రాయపడ్డారు. “కమర్షియల్‌గా సినిమా ఫ్లాప్ అయినా, ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం కథ, టేకింగ్‌ ను బాగా మెచ్చుకున్నారు. మహేష్ బాబుతో మేము మళ్లీ పని చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాం” అని అన్నారు.

మొత్తానికి, మహేష్ బాబు సినిమాలపై వచ్చే హైప్‌ ఎప్పుడూ భారీగానే ఉంటుంది. కానీ 1 నేనొక్కడినే విషయంలో ట్రైలర్‌ రిలీజ్‌ నిర్ణయమే పెద్ద పొరపాటని నిర్మాత స్పష్టంగా అంగీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *