Revanth Reddy

Revanth Reddy: మోదీ భజనలో బిజీగా ఉన్న ఎంపీలు..

Revanth Reddy: తెలంగాణ రైతులకు అవసరమైన యూరియా (Urea) సరఫరా విషయంలో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైతుల కోసం పదేపదే లేఖలు, విజ్ఞప్తులు చేసినా స్పందించని కేంద్రం వైఖరి దారుణమని ఆయన మండిపడ్డారు. రైతుల సమస్యలపై గొంతు కలిపిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి ఆయన సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర మంత్రులపై ఘాటు విమర్శలు

రాష్ట్రానికి అండగా నిలిచి, యూరియా సరఫరా చేయమని ఒత్తిడి తేవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు మాత్రం తమ బాధ్యతను విస్మరించారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మోదీ భజనలో మునిగిపోయి, తెలంగాణ రైతుల పక్షాన నిలబడకపోవడం ద్రోహమేనని ఆయన ఆరోపించారు.

బీఆర్ఎస్ ఎంపీల గైర్హాజరీపై దుయ్యబాటు

రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షం కూడా కలిసి రావాలని కోరినా, బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం పార్లమెంట్‌లో కనిపించకపోవడాన్ని రేవంత్ రెడ్డి ఎండగట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి, కేంద్రంపై పోరాడటానికి వెనుకడుతున్న బీఆర్ఎస్ వైఖరిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Bhatti vikramarka: విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్ల తొలగింపు ఆదేశం

మోదీపై నేరుగా ప్రశ్న

“గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే బీఆర్ఎస్ నేతలు, ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు? మోదీ అంటే భయమా? భక్తా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌లో ధాటిగా ప్రశ్నించారు.

రైతులకు అండగా కాంగ్రెస్

కేంద్రం మొండి వైఖరిని తప్పుబడుతూ, తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో పోరాడుతుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతాంగానికి అండగా నిలబడడంలో కాంగ్రెస్ ఎప్పుడూ వెనుకడదని ఆయన స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rachita Ram: రచిత రామ్ హవా: లోకితో మరో భారీ ఛాన్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *