Priyanka Gandhi: వాయనాడ్ లోక్‌సభ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంట్ లో తన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నారు. అందరినీ ఆకర్షిస్తున్నారు. మంగళవారం పార్లమెంటుకు ‘స్టాండ్ విత్ బంగ్లాదేశ్ హిందువులు – క్రైస్తవులతో కలిసి’ అని రాసి ఉన్న బ్యాగ్‌ని పట్టుకుని వచ్చారు. అంతకు ముందురోజు ఆమె పాలస్తీనాకు మద్దతు ఇచ్చే బ్యాగ్‌తో వచ్చారు. పాలస్తీనాకు ఏది విముక్తి అని ఆ బ్యాగ్ పై రాసి ఉంది. దీనిపై వివాదం కూడా చెలరేగింది. అయితే, ఆమెను ప్రశ్నించిన వారికీ నేను ఎలా దుస్తులు ధరించాలో మరెవరూ నిర్ణయించరు, సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయవాద పితృస్వామ్యాన్ని నేను నమ్మను, నాకు నచ్చినవి వేసుకుంటాను అంటూ సమాధానం ఇచ్చారు.
ఇక పాలస్తీనాకు ప్రియాంక సపోర్ట్ చేయడాన్ని పాకిస్తాన్ లో హర్షం వ్యక్తం అవుతోంది. పాక్ ప్రభుత్వంలో మాజీ మంత్రి ఫవాద్ హసన్ చౌదరి కూడా పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నందుకు ఆమెను ప్రశంసించారు. మన ఎంపీలకు అంత ధైర్యం లేదని ఆయన అన్నారు.
పాక్ ఇమ్రాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఫవాద్ హసన్ చౌదరి, పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన ప్రియాంకపై ప్రశంసలు కురిపించారు. తన ఎక్స్ పోస్ట్ లో – జవహర్‌లాల్ నెహ్రూ వంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడి మనవరాలు నుండి మనం ఇంకా ఏమి ఆశించగలం? ప్రియాంక తన స్థాయిని మరింత పెంచుకుంది, ఇప్పటి వరకు ఏ పాకిస్తానీ ఎంపీ కూడా అలాంటి ధైర్యం చూపించకపోవడం సిగ్గుచేటు అంటూ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: CGS for Farmers: చిన్న రైతులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే పథకం ప్రారంభించిన కేంద్రం!
Priyanka Gandhi: ఇక ఇక్కడ బంగ్లాదేశ్‌లోని హిందూ, క్రిస్టియన్ మైనారిటీలపై ప్రభుత్వం స్వరం పెంచాలని ప్రియాంక అన్నారు. సోమవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రియాంక గాంధీ కూడా ఓ ప్రశ్న వేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ, క్రిస్టియన్ మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం గళం విప్పాలని, వారితో మాట్లాడి వారి మద్దతు కోరాలని నేను చర్చించాలనుకుంటున్న మొదటి అంశం అని ఆమె చెప్పారు. ఈరోజు విజయ దినం. ముందుగా 1971 యుద్ధంలో మన కోసం పోరాడిన వీర జవాన్లకు సెల్యూట్ చేయాలనుకుంటున్నాను. అని అన్నారు.
బంగ్లాదేశ్‌లో ఏం జరిగినా, బంగ్లాదేశ్ ప్రజలు, మన బెంగాలీ సోదరులు మరియు సోదరీమణుల మాటలను ఎవరూ వినడం లేదు. ఆ సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నందున ఆమెకు సెల్యూట్ చేయాలనుకుంటున్నాను అంటూ పార్లమెంట్ లో తన వానిని వినిపించారు ప్రియాంక గాంధీ.