SSMB29

SSMB29: సూపర్ స్టార్ తో ప్రియాంక చోప్రా రొమాన్స్ కాదు.. ఫైటింగ్.. ఇదెక్కడి ట్విస్ట్ జక్కన్న?

SSMB29: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్ సినిమాలకు ధీటుగా తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB29. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ బాబుని రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు పీక్స్ కి చేరాయి. ఈ చిత్రానికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందని మూవీ యూనిట్ ఫస్ట్ నుంచి కూడా చెబుతోంది.పైగా ఈ సినిమాలో గ్లోబల్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుందని.. ఆమె ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ కూడా అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇటీవల ప్రియాంక హైదరాబాద్‌లో కనిపించడంతో ఈ వార్తలకు బలం వచ్చింది. దీంతో ఈ సినిమాలో మహేష్ తో రొమాన్స్ చేయబోయేది ఈ ముద్దు గుమ్మే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ, తాజాగా ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ సినిమాలో ప్రియాంక చోప్రా చేసేది హీరోయిన్ పాత్ర కాదట. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని.. ఆమెది విలన్ పాత్ర అని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇదెక్కడి ట్విస్ట్ జక్కన్న.. అసలేం ప్లాన్ చేసావ్ అంటూ మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *