Priyadarshi: కళ్యాణ ప్రాప్తిరస్తు’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రముఖ యాంకర్ సుమ కనకాల చాలా రేర్ గా సినిమాలు చేస్తోంది. రెండేళ్ళ క్రితం ఆమె ‘జయమ్మ పంచాయితీ’లో టైటిల్ రోల్ పోషించింది. ఇప్పుడు ప్రియదర్శి, ఆనంది నటిస్తున్న ‘ప్రేమంటే’లో ప్రాధాన్యమున్న పాత్రను పోషించబోతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. నవనీత్ శ్రీరామ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు దీనిని నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. పూజా కార్యక్రమాలు జరిగిన సందర్భంగా మూవీ టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి రానా క్లాప్ ఇవ్వగా, సందీప్ రెడ్డి వంగా కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. సునీల్ నారంగ్, భరత్ నారంగ్, అభిషేక్ నామా, సుధాకర్ రెడ్డి, రామ్ మోహన్ రావు, జనార్దన్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీధర్ మూవీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

