Ravi Teja: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో తమిళ యంగ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట సమంత ఈ చిత్రంలో నటించనున్నారని ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పుడు ప్రియా భవానీ శంకర్‌కు ఈ అవకాశం దక్కినట్లు సమాచారం.
Also Read: Samyuktha-Anirudha: రెండో పెళ్లి చేసుకున్న సంయుక్త, అనిరుధ్
కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయమైన ప్రియా భవానీ శంకర్ తర్వాత గోపిచంద్ భీమా, సత్య దేవ్ జీబ్రా చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా, ధూత వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య భార్యగా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో అవకాశాలు వెతుకుంటున్న ఆమెకు తెలుగు పరిశ్రమ నుంచి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. రవితేజ, శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ సినిమాలో ప్రియా భవానీ శంకర్ నటించనున్నారు. ఈ చిత్రంలో మొదట సమంత నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ, చివరికి ప్రియాకు ఈ పాత్ర దక్కినట్లు సమాచారం. రవితేజతో ఈ చిత్రంలో పాల్గొనడం ద్వారా ప్రియా భవానీ శంకర్ తెలుగు పరిశ్రమలో తన క్రేజ్‌ను మరింత బలపరచుకోవచ్చని భావిస్తున్నారు. మరి ఈ అవకాశం ఆమె కెరీర్‌కు ఎలాంటి మలుపు తీసుకురాగలదో చూడాలి.
