Supriya Menon: ఈ సందర్భంగా సుప్రియ ఆ మహిళ ఫోటోను షేర్ చేస్తూ.. `2018 నుంచి ఈమె నాకు తెలుసు.. తనకి చిన్న పిల్లాడున్నాడనే రీజన్ తోనే ఇన్నాళ్లూ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు చనిపోయిన నా తండ్రి మీద కూడా నిందలు వేస్తోంది. ఎన్నో సార్లు తనను బ్లాక్ చేశాను. అయినా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మరీ టార్చర్ చేస్తోంది. ఆమె అకౌంట్స్ ని బ్లాక్ చెయ్యడం నా డైలీ రొటీన్ లో ఓ భాగం అయిపోయింది` అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సుప్రియ. ఇన్ స్టాలో ఆమెకు వన్ మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సినిమాలు నిర్మిస్తున్నారామె.
