Prisons: ప్రపంచంలో జరుగుతున్న నేరాలకు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా శిక్షలు అమలవుతున్నాయి. కొన్ని దేశాల్లో అక్కడి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా శిక్షలు అమలవుతుండగా, ఆధునిక చట్టాల ప్రకారం మరికొన్ని దేశాల్లో ఈ శిక్షలు అమలవుతుంటాయి. ఇంకొన్ని దేశాల్లో కఠిన శిక్షలు ఉండగా, మరికొన్ని దేశాల్లో సాధారణ శిక్షలే అమలవుతున్నాయి. కొన్ని చోట్ల శిక్షా కాలం సుదీర్ఘ కాలం ఉంటుండగా, మరికొన్ని దేశాల్లో కొద్దికాలానికే అమలు చేస్తున్నారు. అయితే సాధారణ నేరాలకూ శిక్షలు అమలు చేస్తూ జైళ్లలో వేస్తూ ఉంటారు. అలా జైళ్లలో ఖైదీల సంఖ్య పెరుగుతూ పోతున్నది. జనాభా వారీగా కూడా జైళ్లలో మగ్గేవారి సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం.
Prisons:జైళ్లలో ఖైదీల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితా చూస్తే మనకు కొంత ఆశ్చర్యం కలుగక మానదు. ఓ సర్వే అంచనా ప్రకారం దేశాల వారీగా ఆయా దేశాల్లో జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య తేలింది. ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయే అత్యాధునిక దేశమైన అమెరికా దేశంలోని జైళ్లలోనే అత్యధిక ఖైదీలు ఉండటం గమనార్హం. ప్రపంచంలోనే దేశాల వారీగా చూస్తూ ఇదే అత్యధిక సంఖ్య. ఈ దేశంలో 18,08,100 మంది వివిధ జైళ్లలో ఉన్నారు.
Prisons:ఆ తర్వాత ప్రపంచంతోనే పోటీపడుతున్న చైనా దేశంలో అమెరికా తర్వాత జైళ్లలో ఖైదీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ దేశంలో 16,90,000 మంది జైళ్లలో మగ్గుతున్నారు. ఆ తర్వాత వరుసగా బ్రెజిల్ 8,50,377తో మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఆ తర్వాత మన ఇండియాలోనే 5,73,220 మంది ఖైదీలు జైళ్లలో ఉండగా, ఈ సంఖ్య ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానంలో ఉన్నది. ఆ తర్వాత రష్యాలో 4,33,006 మంది ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారు.
Prisons:ఆరో స్థానంలో ఉన్న టర్కీలో 3,62,422 మంది, ఏడో స్థానంలో ఉన్న థాయ్‌లాండ్‌లో 2,74,277 మంది, ఎనిమిదో స్థానంలో ఉన్న ఇండోనేషియాలో 2,73,541, తొమ్మిదో స్థానంలో ఉన్న మెక్సికోలో 2,33,687 మంది, పదో స్థానంలో ఉన్న పాకిస్థాన్ దేశంలోని జైళ్లలో 87,712 మంది ఖైదీలు ఉన్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. కొన్ని దేశాల్లో జనాభా వారీగా ఉండగా, మరికొన్ని దేశాల్లో సామాజిక, సంప్రదాయ శిక్షలతో జైళ్లలో ఖైదీల సంఖ్య ఆధారపడి ఉన్నది.
