Gold Chain Stolen: గుడిలో పూజారి..పూజారి మేడలో బంగారు గొలుసు. పూజారి ..పూజారి ..ఒక్కసారి ఇటు రా పూజారి అని ప్రేమగా పిలిచారు అక్కడ ఉన్న ఓ ఇద్దరు. ఎందుకు నాయనా అని ఆ పూజారి అడుగుతే ..మీ మేడలో బంగారాన్ని ఒకసారి తాకితే మేము కోటీశ్వర్లము అవుతాము. మీ ఋణం ఏమి ఉంచుకోము ..మేము కోటీశ్వరులం అవ్వగానే..మీరు కోరింది ఇస్తాము అని బాగానే చెప్పారు …అలా చెప్పి ..ఇలా తిరిగేసరికి .
పూజారి మెడలో ఉన్న బంగారు గొలుసును ఇద్దరు దొంగ భక్తులు మాయమాటలు చెప్పి అపహరించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనకుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఐ పరమేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన ముక్తేవి లక్ష్మీపతి ఆచార్యులు గొడుగుపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామమి ఆలయంలో ప్రధాన అర్చకునిగా పనిచేస్తున్నాడు. లక్ష్మీపతి ఆచార్యులు స్వామి వారికి పూజ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆశీర్వదించాలని పూజారిని కోరారు. అందుకు పూజారి ఆలోచించడంతో తాము ఆలయంలోకి రాకూడదని..అందుకే గోపురం వద్దకు వచ్చి ఆశీర్వదించమని అడుగుతున్నట్లు చెప్పారు. వారి మాటలు నమ్మిన ఆచార్యులు ఆలయం గోపురం వద్దకు వెళ్లి ఇరువురిని ఆశీర్వదించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: మీకు నేనున్నా..అర్చకులు రంగరాజన్ కు సీఎం రేవంత్ ఫోన్
ఆశీర్వచనం అందుకున్న ఇరువురు పూజారి మెడలోని బంగారు గొలుసును తాకితే తమకు అదృష్టం పడుతుందని మాయమాటలు చెప్పారు. ఆయన మెడలోని బంగారు గొలుసును ఒకసారి కళ్లకు అద్దుకుని ఇస్తామని అడిగారు. వారి మాయమాటలు నమ్మిన పూజారి తన మెడలోని బంగారు గొలుసును తీసి దుండగులకు ఇచ్చాడు. గొలుసును కళ్లకు అద్దుకుంటున్నట్లు నటించిన ఇరువురు చిటికెలో బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు.
మోసపోయానని తెలుసుకున్న ఆచార్యులు జరిగిన విషయాన్ని ఇనకుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు..ఆలయం వద్దకు చేరుకుని పూజారి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.