Mahaa Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఆరోగ్యమే “మహా”భాగ్యం అని సూక్తి ఆధారంగా యోగా దినోత్సవంలో మహా గ్రూప్ భాగస్వామ్యమైంది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆర్కే బీచ్ లో మహా గ్రూప్ చైర్మన్ మారేళ్ల వంశీ కృష్ణ సారధ్యంలో ప్రైడ్ ఇండియా హానర్ ఆఫ్ విశాఖ అనే కార్యక్రమం నిర్వహించారు. యోగా మన దేశ వారసత్వ సంపద అని మహా గ్రూప్ చైర్మన్ మారెళ్ళ వంశీ కృష్ణా అన్నారు. ప్రతి ఒక్కరు యోగా ద్వారా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.యోగా గొప్పతనాన్ని గురించి ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మాత్యులు సత్య ప్రసాద్ గారు హాజరయ్యారు.
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక ఒక భాగం కావాలని అనగానే అన్నారు. నిత్యం ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలా పనిచేసే మహా న్యూస్ ఒక సామాజిక బాధ్యతతో యోగా డే గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడంపై మంత్రి మహా గ్రూప్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణను అభినందించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా వీరాంజనేయులు మాట్లాడుతూ.. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఈ యోగా దినోత్సవంతో విశాఖపట్నం ఖ్యాతి పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఇలాంటి అరుదైన కార్యక్రమం నిర్వహణకు విశాఖపట్నం వేదిక అవ్వడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.