Jagdeep Dhankhar resign

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ రాజీనామాకు ఆమోదం

Jagdeep Dhankhar: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం (జులై 21, 2025) రాత్రి తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించగా, నేడు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రాజీనామాను అధికారికంగా ఆమోదించారు.

ధన్‌ఖడ్ పదవీకాలం, ముఖ్య ఘట్టాలు

ధన్‌ఖడ్‌ 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. 2027 వరకు తన పదవి కలం ఉండగా.. రెండేళ్ల ముందే రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ఎక్స్-అఫిషియో చైర్మన్‌గా వ్యవహరించిన ఆయన పదవీకాలంలో పలు కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాలతో వాగ్వాదాలు, న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు, రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్‌ వంటి అంశాలతో ఆయన తరచూ వార్తల్లో నిలిచారు.

ఇది కూడా చదవండి: TG TET 2025 Results: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. 33.98 శాతం ఉత్తీర్ణత

కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక త్వరలోనే

ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యింది. భారత రాజ్యాంగం ప్రకారం, ఉపరాష్ట్రపతి పదవిని “వీలైనంత త్వరగా” భర్తీ చేయాలి. అందువల్ల ఎన్నికల సంఘం త్వరలోనే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే రాజకీయ పార్టీల మధ్య సంప్రదింపులు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ధన్‌ఖడ్ వ్యక్తిగత వివరాలు

జగదీప్ ధన్‌ఖడ్ 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కిథానా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఆయనను 2022 జూలై 16న ఎన్డీఏ (NDA) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగా, 2022 ఆగస్టు 6న జరిగిన ఎన్నికల్లో గెలిచి భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Alludu Adi Narayana Adurs: పులివెందుల అల్లుడు.. ఆది అదరగొట్టాడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *