Mahakali: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మరో భారీ చిత్రం ‘మహాకాళి’ శుభారంభమైంది. పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైన ఈ లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో మూవీ పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయనుంది. ‘హను-మాన్’తో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ప్రశాంత్ వర్మ, ఈ సినిమాతో మరో సంచలనం తీసుకొస్తున్నారు. పూజా కొల్లూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆర్‌కెడి స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా విలన్‌గా కనిపించనున్నట్లు టాక్. ప్రశాంత్ వర్మ మార్క్ విజువల్స్, యాక్షన్‌తో ‘మహాకాళి’ బాక్సాఫీస్‌ను ఆకట్టుకోనుందని అంచనాలు నెలకొన్నాయి. త్వరలో లీడ్ రోల్, రిలీజ్ డేట్‌పై అప్‌డేట్స్ రానున్నాయి. అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు!
View this post on Instagram