Mahakaali: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సంచలనం రాబోతుంది. హనుమాన్ తర్వాత మహాకాళి రూపొందుతోంది. ఇది ఫీమేల్ సూపర్‌హీరో చిత్రం.దీనికి పూజా అపర్ణ దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ, తన PVCUను మరింతగా విస్తరిస్తున్నారు. జై హనుమాన్ క్రేజ్ తో మహాకాళి రూపుదిద్దుకుంటోంది. పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఈ చిత్రం మహిళా సూపర్‌హీరో సినిమాగా నిలుస్తుంది. కాళీదేవిని ప్రేరణగా తీసుకుని మిస్టిక్ పవర్, ఆధ్యాత్మికత, సూపర్‌హీరోయిజం మేళవింపుతో ఈ సినిమా రూపొందుతోంది. అక్టోబర్ 30 ఉదయం 10 గంటలకు అనగా రేపు ఓ స్పెషల్ అప్‌డేట్ రానుంది. రక్తంతో తడిసిన త్రిశూలం పట్టిన చేతి పోస్టర్ ఆకట్టుకుంది. ఇది ఫ్యాన్స్‌లో కుతూహలం రేకెత్తించింది. భారతీయ మైథాలజీని ఆధునిక విజువల్స్‌తో మేళవించే ప్రయత్నం కొత్త దిశలో నడిపిస్తోంది. ఈ సినిమా మహాకాళి దివ్యశక్తికి సూపర్‌హీరో రూపం ఇస్తూ భారతీయ సినీ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
#Mahakali 🔱@RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/CALH4jdCqV
— Prasanth Varma (@PrasanthVarma) October 29, 2025

