Pranaya Godari: తాము తెరకెక్కించింది చిన్న చిత్రమైన పెద్ద మనసుతో ఆదరించి ప్రేక్షకులకు, పాజిటివ్ రివ్యూస్ ను రాసిన మీడియాకు ఆ చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. సదర్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోగా నటించిన ‘ప్రణయ గోదారి’ సినిమా ఈ నెల 13న జనం ముందుకు వచ్చింది. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో దీనిని పారమళ్ళ లింగయ్య నిర్మించారు.
ఇది కూడా చదవండి: Earthquake: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జరీ
Pranaya Godari: ఈ సినిమా చూసిన వారంతా కథ, కథనాల గురించే కాకుండా విజువల్స్ గురించి, సాంగ్స్ గురించి కూడా చాలా బాగా మాట్లాడుతున్నారని, ఆడియెన్స్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని దర్శకుడు విఘ్నేష్ తెలిపారు. ప్రేక్షకుల నుండి లభిస్తున్న ఆదరణ పట్ల సంగీత దర్శకుడు మార్కండేయ, నటీనటులు ఉషాశ్రీ, సునీల్ రావినూతల, కెమెరామేన్ ప్రసాద్ ఈదర, కొరియోగ్రాఫర్ కళాధర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

