Prakash Raj: సినీనటుడు శివాజీ వ్యాఖ్యల ప్రభావం ఇంకా సద్దుమణగలేదు. ప్రతివ్యాఖ్యలు, మద్దతు పోస్టులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కొందరు శివాజీ వ్యాఖ్యలు సమర్థనీయమని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు మహిళల హక్కులకే మద్దతుగా నిలుస్తున్నారు. శివాజీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అనసూయకు కూడా మద్దతునిస్తున్నారు.
Prakash Raj: శివాజీ వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసిన తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట ఆయన హాజరయ్యారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని చెప్పిన శివాజీ.. తన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని, కేవలం రెండు పదాలపై తాను తప్పును ఒప్పుకున్నానని పునరుద్ఘాటించారు. తనపై కక్షగట్టారని, జూమ్ మీటింగ్ పెట్టుకొని తనకు వ్యతిరేకంగా ఓ గ్రూప్ తయారైందని ఆరోపణలు గుప్పించారు.
Prakash Raj: ఇదే దశలో ప్రముఖ సీనయిర్ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. మహిళల వేషధారణ, వారు ధరించే వస్త్రాలపై శివాజీ చేసిన వ్యాఖ్యలను ప్రకాశ్‌రాజ్ తీవ్రంగా ఖండించారు. ఆయన మాటలను తాను వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. తన మద్దతు అనసూయకే అని చెప్పారు. శివాజీ మాత్రమే కాదని, ఎవరైనా మహిళలను కించపర్చడం సరికాదని తేల్చి చెప్పారు. అతని మాటల్లో అవయవాలు మాత్రమే అతనికి కనిపించినట్టు ఉన్నదంటూ ఎద్దేవా చేశారు.
Prakash Raj: ఇదే సమయంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పైనా ప్రకాశ్‌రాజ్ ఘాటుగా స్పందించారు. మావోయిస్టులు మనవాళ్లే కదా.. హంతకులు, టెర్రరిస్టులు కాదని పేర్కొన్నారు. వారిని చంపడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. జనజీవన స్రవంతిలో కలుపాల్సిందిపోయి హత్యలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు.
