Prakasam District: తన కోపమే తన శత్రువు.. అన్నది నానుడి.. ఇక్కడ ఓ వ్యక్తికి వచ్చిన కోపంతో అగ్ని పుట్టి.. దహనమైంది. ఉన్న ఉపాధి కూడా పోయేకాడికి వచ్చింది. ఇలాంటి వారిని కంట్రోల్ చేసేందుకే ఆ నానుడి పుట్టింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లిలో ఓ వాహనం డ్రైవర్, క్లీనర్ మధ్య ఈ ఘటన చోటుచేసుకున్నది.
Prakasam District: పిల్లలను ఇంటి నుంచి స్కూల్‌కు, స్కూల్ నుంచి ఇళ్లకు చేరవేసే వ్యాన్ డ్రైవర్, క్లీనర్ నడుమ వివాదం రాజుకున్నది. మాట పట్టింపులతో ఒకరిపై ఒకరు కోపంతో ఉన్నారు. ఈ దశలో పిల్లలను తీసుకొచ్చేందుకు వాహనాన్ని డ్రైవర్ తీస్తుండగా, కోపంతో రగిలిపోతూ వచ్చిన క్లీనర్ ఆ బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Prakasam District: బస్సు దహనం అవుతుండగా డ్రైవర్ కిందికి దూకాడు. దీంతో ఆ బస్సులో మంటలు వ్యాపించి కాలిపోయింది. ఆ వాహనంలో పిల్లలు, ఇతరులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. చూశారా.. చిన్న కోపం ఓ బస్సు దహనానికి దారితీసింది. అందుకే తన కోపమే తన శత్రువు.. అని పెద్దలు ఊరికే అనలేదు.

