Prabhas vs Ranveer

Prabhas vs Ranveer: ప్రభాస్‌ vs రణ్‌వీర్‌.. బాలీవుడ్లో బిగ్ ఫైట్?

Prabhas vs Ranveer:  ప్రభాస్‌ నటిస్తున్న ‘ది రాజా సాబ్‌’ సినిమా గ్లింప్స్‌ ఇటీవల విడుదలై సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా డిసెంబర్‌ 5న విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రం ఒంటరిగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే, హిందీలో మాత్రం రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘ధురంధర్‌’ సినిమాతో గట్టి పోటీ ఎదురవుతోంది. జియో స్టూడియోస్‌ జులై 6న ‘ధురంధర్‌’ విడుదల తేదీని ప్రకటించి, గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్ విడుదలయ్యాక ఈ చిత్రంపై అంచనాలు పీక్స్ కి చేరాయి. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌ భారతదేశ తొలి సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నారు.

Also Read: The Bengal Files: అమెరికాలో 10 నగరాల్లో ది బెంగాల్ ఫైల్స్ గ్రాండ్ ప్రీమియర్స్!

1970 నుంచి ఇప్పటి వరకు భారత్‌, పాకిస్తాన్‌లలో సాగే కథ ఇది. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంజయ్‌ దత్‌, ఆర్‌. మాధవన్‌, అక్షయ్‌ ఖన్నా, అర్జున్‌ రాంపాల్‌ లాంటి బలమైన తారాగణం ఉంది. ‘ది రాజా సాబ్‌’ గ్లింప్స్‌ సినీ అభిమానుల్లో హైప్‌ పెంచినా, హిందీలో ‘ధురంధర్‌’ గట్టి సవాలుగా నిలవనుంది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ప్రభావం చూపనున్నాయో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  OTT: ఓటీటీలో రాబోతున్న నయనతార ‘టెస్ట్’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *