Prabhas: ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ అభిమానుల సంఖ్య దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. అయితే తాజాగా మళ్లీ ప్రభాస్ పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తెతో పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు షికారు చేశాయి. సోషల్ మీడియాలో ముహూర్తాలు కూడా వైరల్ అయ్యాయి.అయితే, ప్రభాస్ టీమ్ ఈ వార్తలను కొట్టిపారేసింది. “ఇవన్నీ ఫేక్, నమ్మవద్దు” అని స్పష్టం చేశారు. గతంలో భీమవరం అమ్మాయి, అనుష్క, కృతితో సంబంధం అన్న రూమర్లనూ ఖండించారు.
Also Read: Horror Thriller OTT: రెండు ఓటిటిల్లో అర్జున్ హారర్ థ్రిల్లర్!
Prabhas: ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’, ‘సలార్ 2’, ‘కల్కి 2’ లాంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమా బడ్జెట్ 300 కోట్లు దాటుతోంది. ‘కల్కి 2898 ఏడి’ క్రేజ్‌తో అతని స్థాయి ఎక్కడుందో తెలిసిందే.ఇలాంటి టైంలో పెళ్లి రూమర్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రభాస్ టీమ్ రిపీటెడ్‌గా స్పందిస్తున్నా, ఆయన మాత్రం పెళ్లి గురించి స్పష్టత ఇవ్వడం లేదు. పెళ్లి ప్రశ్నలు వస్తే తప్పించుకుంటున్నాడు. అయినా రూమర్లు ఆగడం లేదు. ఇక ప్రభాస్ పెళ్లి వార్తల్లో నిజం తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.