Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం కోసం ప్రభాస్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రెబల్ స్టార్ ప్రభాస్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఒక స్పెషల్ లుక్‌తో ప్రిపేర్ అవుతున్నాడు. ఆ లుక్ కోసం ఆరు నెలల పాటు బయటకు కనిపించకూడదని నిర్ణయించినట్టు సమాచారం. ఈ ఆలోచన మొత్తం సందీప్ రెడ్డి వంగదే అని తెలుస్తోంది. ప్రభాస్‌ను ఎప్పటికీ చూడని రూపంలో చూపించేందుకు దర్శకుడు ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ విషయం అభిమానుల్లో సంచలనం రేపింది. ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’తో పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకున్న ప్రభాస్, ‘స్పిరిట్’తో మరో కొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
