Prabhas-Rajinikanth: ఇండియన్ సినిమాలో భారీ మార్కెట్ ఉన్న టాప్ హీరోలు ఎవరంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ రజినీకాంత్ పేర్లు ముందుగా వినిపిస్తాయి. కన్నడలో కూడా వీరి సినిమాలకు భారీ హైప్ ఉంటుంది. ఇలా ఒకే హీరో నుంచి ఆరు చిత్రాలు భారీ వసూళ్లు సాధించడం అరుదైన ఘనత. ఇటీవలి సినిమాలతో ఈ మైలురాయి చేరుకున్నారు. మరి ఇలాంటి రికార్డు సాధించిన హీరోలు ఎవరు? ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
నాన్-కన్నడ యాక్టర్లలో కర్ణాటక బాక్సాఫీస్‌లో 20 కోట్లు దాటిన సినిమాలు ఎక్కువగా ఉన్నవారు ప్రభాస్, రజినీకాంత్. ప్రభాస్ ఆరు చిత్రాలు ఈ మార్క్ కి చేరాయి. రజినీ ఐదు సినిమాలతో ఉండగా, లేటెస్ట్ ‘కూలీ’తో ఆరుకు చేరుకున్నారు. ‘వేట్టయాన్’ కూడా 20 కోట్లు క్రాస్ చేసింది. ఇతర హీరోలు అమీర్ ఖాన్, చిరంజీవి, అల్లు అర్జున్ వంటివారు రెండు లేదా మూడు సినిమాలతో మాత్రమే సాధించారు. ఈ రికార్డుతో వీరిద్దరూ మాత్రమే టాప్‌లో నిలిచారు. మిగిలిన స్టార్లు ఇంకా దూరంగా ఉన్నారు.