Prabhas Hanu: ఆపరేషన్ జెడ్.. ‘ప్రభాస్ – హను’ ప్రీలుక్ పోస్టర్‌లో దిమ్మ తిరిగే డీటెయిల్స్

Prabhas Hanu: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఇంకా దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటినుండి ఈ సినిమాపైన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో హను రాఘవపూడి ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ లో సినిమాపైన ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని అందుకుంటుంది అన్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న విషయం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ పోస్టర్ కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, సినిమా నేపథ్యం, కథాంశంపై బలమైన సంకేతాలను ఇస్తోంది.

పోస్టర్ డికోడ్: గీతా బోధన & ఏకాంత వీరుడి పోరాటం
పోస్టర్‌ను నిశితంగా పరిశీలిస్తే, ఇది కేవలం యాక్షన్ థ్రిల్లర్ కాదని, ఒక బలమైన తాత్విక(బలమైన) నేపథ్యం ఉన్న కథగా తెలుస్తోంది.

శ్రీమద్భగవద్గీత శ్లోకాలు: పోస్టర్ నిండా భగవద్గీతలోని రెండవ అధ్యాయానికి సంబంధించిన శ్లోకాలు ముద్రించి ఉన్నాయి. ఇవి ప్రధానంగా కర్తవ్యం (Duty) యుద్ధం (Battle) గురించి అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనలను సూచిస్తున్నాయి.

పద్మవ్యూహ విజయం: ఈ శ్లోకాలతో పాటు, పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడి అంశాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. ఇది సినిమాలో ప్రభాస్ పాత్ర ఒక ఏకాంత వీరుడిగా (Lone Warrior) నిలబడి, అసాధ్యమైన సవాళ్లను లేదా శత్రువుల బలమైన వలయాన్ని ఛేదించే పోరాటాన్ని సూచిస్తుంది.

గన్స్‌తో అలంకారం: పోస్టర్ మధ్యలో ఒక మానవ ఆకృతిని భారీగా పేర్చిన గన్స్ (తుపాకులు) చుట్టుముట్టాయి. ఇది ఒక యుద్ధ వాతావరణాన్ని, అలాగే హీరో చుట్టూ ఉన్న ప్రమాదాన్ని, అతడికి ఎదురుగా ఉన్న సైనిక శక్తిని దృశ్యమానం చేస్తుంది.
టీజర్ వివరాలు ఎప్పుడు? ‘ఆపరేషన్ Z’ రహస్యం!

కీలక తేదీ: ప్రభాస్ బర్త్ డే కి ఒక్క రోజు ముందుగానే 22.10.25 ఈ సినిమాకి సంబందించిన హీరో ఫస్ట్ లుక్, మూవీ టైటిల్ ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

కోడ్ నేమ్: పోస్టర్ కింద భాగంలో “ఆపరేషన్ Z” అనే కోడ్ నేమ్ ఉంది. ఇది సినిమా కథలో హీరో చేసే ఆపరేషన్ హా లేఖ దాని తర్వాత జరిగే కథనా అనేది టీజర్ లేదా ట్రైలర్ లో తెలియవచ్చు.

ప్రభాస్ ఇమేజ్‌కు, హను రాఘవపూడి టేకింగ్‌కు తగ్గట్టుగా, ఈ చిత్రం ఒక ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటిది అంటే ఈ సినిమా బెంగాలీలో కూడా రిలీజ్ చేయనున్నార.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *