Prabhas

Prabhas: ప్రభాస్‌ – సుజీత్ – హోంబాలే కాంబో లోడింగ్?

Prabhas: యంగ్ దర్శకుడు సుజీత్ పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. ‘ఓజీ’ సినిమా తర్వాత ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ సుజీత్‌ను లాక్ చేసిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్‌తోనే ఈ చిత్రం కావొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Mysaa: మాస్ లుక్‌లో రష్మిక.. ‘మైసా’ రచ్చ సిద్ధం!

సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘సాహో’ చిత్రం యావరేజ్ హిట్ సాధించినా, ప్రభాస్ ఆయన యాక్షన్ దృశ్యాల నిర్వహణను బాగా మెచ్చుకున్నాడు. దాంతో ఇద్దరూ మళ్లీ కలిసి పనిచేయనున్నట్టు తాజా సమాచారం. ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమా పలు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం నానితో ఒక చిత్రం చేస్తున్న సుజీత్‌కు, పలు పెద్ద నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు అందుతున్నాయి. గతంలో సుజీత్ ఒక ఇంటర్వ్యూలో, ప్రభాస్‌తో యాక్షన్ కామెడీ జోనర్‌లో సినిమా చేయాలని అన్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ మళ్లీ రావడం ఆసక్తికరంగా ఉంది. ఈసారి ఈ కాంబోకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నట్టు కూడా టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *